నిజామాబాద్: లిఫ్ట్ ఇచ్చి బంగారం ఎత్తుకెళ్లిన దొంగ
మహిళకు లిఫ్ట్ ఇచ్చి అనంతరం బంగారం ఎత్తుకెళ్లిన ఘటన నిజాంసాగర్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. లచ్చవ్వ, విట్టల్ కలిసి కిష్టాపూర్ లో బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అటువైపు వెళ్తున్నానని నమ్మించి వారిని బైక్ పై ఎక్కించుకున్నాడు. కొద్దీ దూరం వెళ్ళాక మహిళను కొట్టి బంగారం లాక్కెళ్లినట్టు ఎస్ఐ తెలిపారు.