సంక్రాంతికి పతంగులు, పిండివంటలే కాదు కోడి పందేలు కూడా అమితంగా ఆకట్టుకుంటాయి. అయితే ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలోనే చూస్తుంటాం. కానీ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ నిర్వహిస్తుంటారట. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్‌లో కోడిపందేలు నిర్వహిస్తారట. ఇంకా మంచిర్యాల జిల్లా ప్రాణహిత తీర ప్రాంతాలైన వేమనపల్లి, కోటపల్లి, జైపూర్, భీమారంలతో పాటు దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో కూడా కోడిపందేలు జోరుగా నిర్వహిస్తారట.