తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తుందని CM రేవంత్ అన్నారు. తొలి ఏడాదిలోనే ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివద్ది పనులన్నీ రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న సానుకూలతలను ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్‌లో రాష్ట్రంలో పెట్టుబడుల సమీకరణ, వాటి పురోగతిపై మంత్రి శ్రీధర్ బాబుతో సోమవారం సీఎం భేటీ అయ్యారు.