Sep 15, 2024, 11:09 IST/
విశాఖలో మత్స్యకారుల పడవలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
Sep 15, 2024, 11:09 IST
మత్స్యకారుల పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పడవలో ఉన్న ఐదుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకారు. విశాఖ జిల్లాలోని ఫిషింగ్ హార్బర్ నుంచి వాసుపల్లి అప్పయ్యమ్మకు చెందిన ఓ బోటులో ఐదుగురు మత్స్యకారులు వేటకు బయలుదేరి వెళ్లారు. తీరానికి 35 మైళ్ల దూరంలో వెళ్లగానే బోటులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించి బోటు పూర్తిగా దగ్ధమైంది. ఇక సముద్రంలోకి దూకిన మత్స్యకారులను కోస్ట్‌గార్డు సిబ్బంది రక్షించారు.