మనస్తాపంతో యువకుడు సూసైడ్
పిట్లం మండలం తిమ్మానగర్లో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు మందలించారని మనస్తాపంతో శుక్రవారం కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. నాందేవ్ (23) అనే యువకుడు పనిచేయకుండా ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. ఈ విషయంలో తల్లిదండ్రులు మందలించగా గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.