ఏపీలో నేటి నుంచి తేలికపాటి వర్షాలు

79చూసినవారు
ఏపీలో నేటి నుంచి తేలికపాటి వర్షాలు
దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో ఇవాళ, రేపు ఏపీలో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడనున్నట్లు తెలిపింది. అలాగే ఉత్తర, మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడనున్నట్లు పేర్కొంది. ఇది తీవ్రరూపం దాల్చి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని.. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్