రోజూ రూ.600 ఆదా చేసుకోవాలని సూచించిన బిలియనీర్ హర్ష్ గొయెంకా.. వెల్లువెత్తిన విమర్శలు

76చూసినవారు
రోజూ రూ.600 ఆదా చేసుకోవాలని సూచించిన బిలియనీర్ హర్ష్ గొయెంకా.. వెల్లువెత్తిన విమర్శలు
ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ హర్ష్ గొయెంకా ''చిన్న అలవాట్ల శక్తిని తక్కువ అంచనా వేయవద్దు” అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. అలాగే "ప్రతి రోజూ రూ.600 ఆదా చేస్తే ఏడాదికి రూ.2,19,000 పొదుపు చేయవచ్చు"అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్టుపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. "సగటు రోజువారీ ఆదాయం సుమారు రూ.270 ఉన్న దేశంలో రోజుకు రూ.600 ఎలా ఆదా చేయగలం" అంటూ ఓ యూజర్ స్పందించారు. "రోజుకు రూ.600 అంటే నెలకు రూ.18,000, నా సంపాదనే అంత లేదు" అని మరొకరు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్