దుర్గాదేవి విగ్రహం దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
హైదరాబాద్ లోని నాగన్ పల్లిలో దుర్గాదేవి మండపం వద్ద దుర్గాదేవి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారని, వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇందుకు నిరసనగా సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలో హిందూ సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసంచేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ దీక్షను పోలీసులు వచ్చి అడ్డుకున్నారు.