ఘనంగా జాతిపిత జయంతి వేడుకలు

77చూసినవారు
ఘనంగా జాతిపిత జయంతి వేడుకలు
రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామంలో బుధవారం జాతిపిత గాంధీ జయంతి వేడుకలను మాజీ జడ్పీటీసీ నారోజీ గంగారాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి టెంకాయలు కొట్టి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ జడ్పీటీసీ నారోజీ గంగారాం మాట్లాడుతూ, గాంధీ అడుగుజాడల్లో నేటి యువతరం నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నారోజీ గంగారాం, గ్రామ అధ్యక్షులు పట్ల సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్