ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

67చూసినవారు
ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
రుద్రూర్ మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం బోధన్ అధ్యక్షుడు మోత్కురి నారాయణ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఏర్పాటు కోసం కీలక పాత్ర పోషించారని పద్మ శాలి అభ్యున్నతితో పాటు చేనేత కార్మికుల అభివృద్ధికి ఆయన సేవలు ఎనలేనివని అన్నారు. ఆయన ఆశయసాధన కోసం చేనేత కార్మికులు పాటు పడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్