సదాశివనగర్ మండలం - Sadashivanagar

నిజామాబాద్ జిల్లా
"సి.ఏ 1st ర్యాంకు రిషబ్ ఓస్వాల్ కు మాస్టర్ మైండ్స్ సన్మానం"
Jan 09, 2025, 13:01 IST/

"సి.ఏ 1st ర్యాంకు రిషబ్ ఓస్వాల్ కు మాస్టర్ మైండ్స్ సన్మానం"

Jan 09, 2025, 13:01 IST
ఇటీవల "The Institute of Chartered Accountants of India (ICAI)" వారు విడుదల చేసిన సీ.ఏ ఫైనల్ ఫలితాలలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఆర్. రిషబ్ ఓస్వాల్ ను (HT No. 692795) మాస్టర్ మైండ్స్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయ మిత్రుల సమావేశంలో మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ సీ.ఏ విద్యాసంస్థ గురించి,సీఏ విద్యా విధానం గురించి కామర్స్ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. దానిని ప్రోత్సహించవలసిన బాధ్యత అందరూ తీసుకోవాలని కోరారు. IIT లాంటి కోర్స్ చదవాలి అంటే ప్రతి సంవత్సరం IIT పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య సుమారుగా 14 లక్షలు ఉంటే అందులో సీట్లు పొందేది సుమారుగా 15 వేల మంది మాత్రమేనన్నారు. NEET లాంటి పరీక్షను 24 లక్షల మంది రాస్తే అందులో లక్ష 6 వేల మందికి మాత్రమే సీట్లు ఉంటాయని తెలిపారు. కానీ ప్రతి సంవత్సరం మూడు సార్లు జరిగే సీ.ఏ పరీక్షలలో మాత్రం అటెంప్ట్ కి 13% నుండి 15% అంటే సుమారుగా సంవత్సరానికి 40% నుంచి 45% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తున్నారని మోహన్ తెలియజేసారు. సాధారణ విద్యార్థులు కూడా మంచి కెరీర్ ను ఎంచుకోవటానికి కామర్స్ దోహదపడుతుందని ఈ సందర్భంగా మోహన్ తెలిపారు. ఈ సమావేశంలో రిషబ్ మాట్లాడుతూ తనను ప్రోత్సహించినటువంటి మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థకు, తన తల్లిదండ్రులకు మరియు తనను ప్రోత్సహించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మోహన్ రిషబ్ ను శాలువాతో సత్కరించి లక్ష రూపాయల చెక్ ని గిఫ్ట్ గా అందించారు.