అఫంది ఫారం తండాలో చిరుత దాడిలో లేగదూడ మృతి
వర్ని మండలంలోని అఫంది ఫారం తండాలో రాత్రి చిరుత పులి దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. హరి సింగ్ తన పాకలో కట్టేసి ఉంచిన లేగదూడ ఉదయం లేచి చూసేసరికి మృతి చెందినట్టు తెలిపారు. చిరుత పులి అడుగులు ఉన్నట్టు తెలిపారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని అన్నారు. సంబంధిత అటవీ అధికారులు చిరుత గ్రామాల వైపు రాకుండా అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.