వర్ని మండలంలో రోడ్డు ప్రమాదం
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని బడాపహాడ్ నుంచి హనుమాజీపేట వైపు వెళ్లే రహదారి పై అశోక్ లేలాండ్ వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడని స్థానికులు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.