రైతుభరోసాపై అనుమానాలు అవసరం లేదు: CM రేవంత్

53చూసినవారు
రైతుభరోసాపై అనుమానాలు అవసరం లేదు: CM రేవంత్
రైతుభరోసాపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో  ఆయన మాట్లాడుతూ.. 'గత ప్రభుత్వం రైతుబంధు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సాగులో లేని భూములకు వాళ్లు రైతుబంధు ఇచ్చారు. రూ.22,600 కోట్లు దీని ద్వారా ఆయాచిత లబ్ధి చేశారు. రియల్‌ ఎస్టేట్‌, పారిశ్రామికవేత్తలకూ రైతుబంధు ఇచ్చారు. మనం రాళ్లకు, గుట్టలకు ఇద్దామా? భూముల్లో రహదారి వెళ్తే దానికీ రైతుబంధు జమ చేశారు' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్