ప్రముఖ తమిళ డైరెక్టర్ సభాపతి దక్షిణామూర్తి (61) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఈయన తమిళంలో విజయ్‌కాంత్ హీరోగా భరతన్ మూవీతో దర్శకునిగా ప్రయాణం మొదలుపెట్టారు. తర్వాత ప్రభుదేవాతో వీఐపీ, తెలుగులో 2005లో జగపతిబాబు, కళ్యాణి జంటగా ‘పందెం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. సభా తమిళంలో తీసిన ‘సుందర పురుషుడు’ అనే సినిమా 'అందాల రాముడు'గా రీమేక్ చేశారు. మొత్తంగా 10 మూవీలకు పనిచేశారు. ఆయన మృతిపై తమిళ సినీ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేస్తుంది.