కెప్టెన్‌గా రోహిత్‌ లేనంత మాత్రాన ఏమీ మారదు: పాండ్య

586చూసినవారు
కెప్టెన్‌గా రోహిత్‌ లేనంత మాత్రాన ఏమీ మారదు: పాండ్య
జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్‌ కొత్త సారథి హార్దిక్‌ పాండ్య అన్నాడు. ఈ సీజన్‌ నుంచే సారథిగా రోహిత్‌ స్థానంలో హార్దిక్‌ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ‘‘ఏం తేడా ఉండదు. అతను నాకెప్పుడూ సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. ఈ జట్టు ఏదైతే సాధించిందో, అదంతా అతని సారథ్యంలోనే దక్కింది. నేను దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది‘‘ అని పాండ్య అన్నారు.

సంబంధిత పోస్ట్