దేశవ్యాప్తంగా ఉన్న మిలటరీ స్కూళ్లలో 6, 9వ తరగతులలో అడ్మిషన్లు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఐదో తరగతి పూర్తిచేసిన/ చదువుతున్న విద్యార్థులు ఈ నెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తొమ్మిదో తరగతిలో అడ్మిషన్ కోసం ఎనిమిదో తరగతి పూర్తిచేసిన లేదా చదువుతున్న వారు అర్హులు. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం www.rashtriyamilitaryschools.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.