1945 లో జపాన్ తో వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా మార్గాన్ని అన్వేషించింది. తాము తయారు చేసిన అణ్వాయుధాన్ని పరీక్షించడమే కాకుండా భారీ నష్టాన్ని కలిగించేందుకు బాంబు దాడులు చేయాలని అమెరికా నిర్ణయించింది. అణు బాంబులను ఉపయోగించడం ద్వారా జపాన్‌ను లొంగిపోయేలా చేయవచ్చని అమెరికా భావించినట్టు నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యూక్లియర్ సైన్స్ అండ్ హిస్టరీ క్యూరేటర్ జేమ్స్ స్టెమ్ వెల్లడించారు.