నూజివీడు విత్తనాల కంపెనీ నూతన వరి వంగడం ‘NP8912’ని బుధవారం మార్కెట్‌లోకి విడుదల చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో రబీ సీజన్‌లో రైతులు సాగుకు అనుకూలంగా వినియోగించుకునేలా ఆయా రాష్ట్రాల్లో వర్చువల్ పద్దతిలో విడుదల చేశామని కంపెనీ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వంగడం ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని 118 రోజుల్లో అధిక దిగుబడి అందిస్తుందని పేర్కొన్నారు.