క్రిస్మస్ సందర్భంగా హీరో సుహాస్ నటిస్తున్న 'ఓ భామ అయ్యోరామా' చిత్రం గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఎప్పటికప్పుడు కొత్త కథలతో అలరిస్తున్న నటుడు సుహాస్. అలాంటి కొత్త కథతో మళ్లీ వచ్చారు. ఈ చిత్రంలో మాళవిక మనోజ్ కథానాయిక. రామ్ గోదాల దర్శకత్వంలో ఇది రానుంది. 'దేవుడినైనా రాముడినైనా నడిపించేది ఆడదే..' అంటూ సాగే ఆ వీడియో ఆకట్టుకుంటోంది.