మద్యపానం వల్ల ప్రత్యక్షంగా కంటిచూపులో, జ్ఞాపకశక్తిలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయని వైద్య సర్వేలు చెబుతున్నాయి. మెదడులోని నాడీ వ్యవస్థను మద్యపానం ప్రభావితం చేస్తుంది. నాడీ వ్యవస్థ క్రమంగా బలహీనపడుతుంది. నరాలు దెబ్బతినడం, కాళ్లు, చేతుల్లో స్పర్శ తగ్గడం, అరికాళ్లలో మంటలు, కండరాలు బలహీనం, పక్షవాతం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. నడిస్తే తూలిపోవడం, నడవలేకపోవడం, తెలివితేటలు మందగించడం, మతిమరుపు లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.