పారిస్ ఒలింపిక్స్ లో 10మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో మనూ భాకర్ తో కలిసి సరబ్ జోత్ సింగ్ బ్రాంజ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. విజయం తర్వాత తొలిసారి షూటర్ సరబ్ జోత్ స్వదేశానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అభిమానులు, కుటుంబసభ్యులు ఆయనను పూలమాలలతో సత్కరించారు.