క్యాన్సర్ మహమ్మారికి సంబంధించి ఓ అధ్యయనం బయటకు వచ్చింది. దేశంలో నోటి క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని.. పొగాకు, ఆల్కహాల్ వంటి దురలవాట్లు లేనివారిలో సైతం ఈ రోగం విస్తరిస్తున్నట్లు వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం.. గత పదేళ్ల కాలంలో గమనించిన నోటి క్యాన్సర్ కేసుల్లో 57శాతం పొగాకు లేదా మద్యం అలవాటులేని వ్యక్తుల్లోనే సంభవించాయి. క్యాన్సర్ బారిన పడిన వ్యక్తుల్లో 75.5శాతం మంది పురుషులు కాగా.. 24.5శాతం మహిళలు ఉన్నారు.