సింగిల్స్ కోసం ఓ వినూత్న ఆఫర్ వచ్చేసింది. అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకోవచ్చు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ చిత్రవిచిత్రమైన ఆఫర్ వాడుకలో ఉన్నది చైనాలో. అయితే ఈ స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ సేవలకు కూడా ఛార్జ్ ఉంటుందట. కౌగిలింతకు రూ.11, ముద్దుకు రూ.110, సినిమా చూడటానికి రూ.150 చెల్లించాలని తెలుస్తోంది. అలాగే ఇంటికి తీసుకెళ్లి ఇద్దరూ కలిసి మద్యం సేవించాలంటే.. గంటకు రూ.461 చెల్లించాలట. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.