ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఓటీటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్షయ్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో సక్సెస్ రేటు తగ్గడానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లే కారణమని అన్నారు. వీటి కారణంగానే చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రేక్షకులు ఓటీటీలపై ఆధారపడి సినిమా థియేటర్లకు రావడం తగ్గిందని పేర్కొన్నారు.