స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న వీల్ చైర్‌లో కనిపించారు. HYD శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆమె నడవలేని స్థితిలో ఉండటంతో వీల్ చైర్‌లో తీసుకెళ్లారు. అయితే తన ముఖం కనిపించకుండా రష్మిక క్యాప్‌తో కవర్ చేసుకున్నారు. ఇక ఇటీవల ఆమె జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా కాలు బెనికింది. గాయం నుంచి కోలుకునేందుకు నెలలు కూడా పట్టొచ్చేమో అని ఆమె తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ కూడా చేశారు.