సీఎం రేసులో తాను, కవిత ఉన్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎప్పటికీ కేసీఆరే తమ సీఎం అభ్యర్థి అని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్‌కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఫార్ములా-ఈ రేసు కేసులో విచారణకు హాజరవ్వాలా లేదా అనే విషయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అరెస్ట్ చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు.