రీల్స్ పిచ్చిలో పడి అనేక మంది ప్రాణాలకు మీదకు తెచ్చుకోవడం మనం చూస్తుంటాం. అలాంటి ఓ ఘటన శ్రీలంకలో జరిగింది. చైనాకు చెందిన ఓ మహిళ ఇటీవల శ్రీలంకలో పర్యటించింది. కొలంబో నుంచి ఓ రైలులో ప్రయాణిస్తూ ప్రమాదకర విన్యాసాలు చేసే క్రమంలో చెట్టు కొమ్మ ఢీకొని రైలు నుంచి పడిపోయింది. ప్రమాదాన్ని గమనిస్తే ఆమె చనిపోయి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ చివరకు ప్రాణాలతో బయటపడింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.