నటుడు మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే విధించాలని కోరుతూ పిటిషన్ వేశారు. మోహన్‌బాబు పిటిషన్‌పై జస్టిస్ బి. విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. మోహన్ బాబు మంగళవారం రాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ ఆస్పత్రి బృందం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.