భారత రాయబార కార్యాలయంలో పాక్ ISI ఏజెంట్

59చూసినవారు
భారత రాయబార కార్యాలయంలో పాక్ ISI ఏజెంట్
మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న పాక్ ఐఎస్ఐ ఏజెంట్‌ను ఉగ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) ఆదివారం అరెస్ట్ చేసింది. సత్యేంద్ర సివల్ అనే ఏజెంట్ 2021 నుంచి మాస్కోలోని ఇండియన్ ఎంబసీలో పని చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌కు చెందిన సత్యేంద్ర సివల్ విదేశీ మంత్రిత్వ శాఖలో ఎంటీఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పక్కా సమాచారం మేరకు ఏటీఎస్ పోలీసులు సత్యేంద్రను అరెస్ట్ చేశారు.