పాలస్తీనా ప్రాంతాన్ని పోలియో మహమ్మారి ప్రాంతంగా గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇజ్రాయెల్ సైనిక చర్య వల్ల ఇక్కడ ఆరోగ్య మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని.. ఈ పరిస్థితులు వైరస్ పునరుజ్జీవానికి దారి తీశాయని ఆరోపించింది. దక్షిణ ఖాన్ యూనిస్ ప్రాంతంలో సేకరించిన మురుగు నీటి నమూనాల్లో CPV2 రకం కనిపించిందని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఏవైనా పోలియో కేసులు నమోదయ్యాయా అనే వివరాలను వెల్లడింపలేదు.