పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ స్టేట్ ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. గ్రామాల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాను అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించింది. 2024 OCT 1 నుంచి DEC 31 వరకు జాబితా ఉండగా, ఫిబ్రవరి 3 వరకు సప్లిమెంటరీ లిస్టు రెడీ చేయాలని సూచించింది. ఓటర్ల తొలగింపు, చేర్పులపై ఫిబ్రవరి 4న స్థానిక రాజకీయ నాయకులతో భేటీ నిర్వహించాలంది. ఫిబ్రవరి 6 నాటికి తుది జాబితాను ఖరారు చేయాలని ఆదేశించింది.