పారిస్ ఒలింపిక్స్: బాక్సర్ నిఖత్ జరీన్ ఓటమి

74చూసినవారు
పారిస్ ఒలింపిక్స్: బాక్సర్ నిఖత్ జరీన్ ఓటమి
పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు ఓటమి పాలైంది. మహిళల 50 కేజీల ప్రి క్వార్టర్స్‌లో నిఖత్‌పై 0-5 తేడాతో వు హు (చైనా) విజయం సాధించింది. చైనా బాక్సర్‌ వు హు 30-27, 29-28, 29-28, 30-27తో విజయం సాధించింది. దీంతో ఒలింపిక్స్‌లో నిఖత్‌ పతక ఆశలు ఆవిరయ్యాయి. కాగా రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌, తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌కు ఇవే తొలి ఒలింపిక్స్‌.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్