పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి. ఈ భారీ ఈవెంట్‌ను విజయవంతం చేయడంతో నిర్వహకులు కఠిన చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ గేమ్స్ సందర్భంగా 140కిపైగా సైబర్ దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. వీటి వల్ల క్రీడలకు ఎలాంటి ఆటంకాలు కలగలేదని తెలిపారు. ఈ దాడులు ప్రధానంగా ప్రభుత్వ సంస్థలతో పాటు క్రీడలు, రవాణా, టెలికాం, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయని సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది.