‘సీఎం చంద్రబాబు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మరణించారని తెలిసి చింతిస్తున్నా’ అని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ‘రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలి. సోదర వియోగంతో బాధపడుతున్న సీఎం చంద్రబాబుకు నా ప్రగాఢ సానుభూతి. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉండటంతో అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నా. ఆయన కుమారుడు రోహిత్, కుటుంబసభ్యులకు నా సంతాపం తెలుపుతున్నా’’ అని పవన్ పోస్ట్ చేశారు.