శిశువులు మరణించిన ఆసుపత్రి వద్ద డిప్యూటీ సీఎంకు వీఐపీ స్వాగతం (వీడియో)

52చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో పది మంది నవజాత శిశువులు మరణించిన విషయం తెలిసిందే. అయితే హాస్పిటల్‌ సందర్శన కోసం వచ్చిన డిప్యూటీ సీఎంకు అధికారులు వీఐపీ స్వాగతం పలికారు.దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ఈ చర్య సిగ్గుచేటని విమర్శించింది. మరోవైపు డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్‌ ఈ విమర్శలపై స్పందించారు. వీఐపీ స్వాగతాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్