పవన్ చేసిన కృషి ఫలితమే.. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపు

78చూసినవారు
పవన్ చేసిన కృషి ఫలితమే.. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపు
మూడు పార్టీలు.. మూడు గుర్తులు.. కొంత గందరగోళం అని అనుకున్నా .. సక్సెస్ ఫుల్‌గా గుర్తులను బలంగా జనంలోకి తీసుకెళ్లారు. ఎంతగా అంటే ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా చూడగలిగారు. అదే సమయంలో గుర్తులను గుర్తు పట్టి కూటమి తరుపున అభ్యర్థులకు ఓటు వేసేలా పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఫలించిందనే చెప్పాలి. ఈసారి కాకుంటే.. ఇక తమ సామాజికవర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత ఉండదని భావించి కాపులు అందరూ ఏకమై పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్‌ను భారీ మెజార్టీతో గెలిపంచారు.