కలిసి జీవించాల్సిన ప్రజల మధ్య ఏ కారణం చేత విబేధాలు ఏర్పడ్డా ప్రభుత్వాలు జోక్యం చేసుకొని, సయోధ్య కుదిర్చే చర్యలను చేపట్టాలి. శాంతి, సామరస్యం నెలకొనేలా కృషి చేయాలి. మైనార్టీ – మెజార్టీ అనే సంకుచిత ఆలోచనలతో రాజకీయ లబ్ధి కోసం మాత్రమే పనిచేస్తే అది దేశ ప్రయోజనాలకు తీవ్రమైన విఘాతం కలిగిస్తుంది. మణిపూర్‌లో శాంతిభద్రతలు, ప్రజల సమైక్య జీవనం చాలా అవసరం. అల్లర్లకు ఆజ్యం పోసేలా కాక శాంతి సామరస్యాలు నెలకొల్పేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా తక్షణ చర్యలు చేపట్టాలి.