తెలంగాణ గాయకుడు, తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన కుమారుడు తండ్రిని తలుచుకొని కన్నీరు పెడుతున్నాడు. తండ్రిని మర్చిపోలేక తండ్రి షర్ట్ ను పట్టుకొని నిద్రపోతున్నాడు. ఈ ఫోటో చూసిన వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. అయ్యో సాయిచంద్.. కనీసం పిల్లల కోసమైన ఒక్కసారి రావా అంటూ నెటిజన్లు బాధాతప్త హృదయంతో సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.