ధరణిలో లోపాలు సరిదిద్దడమే మా ఉద్దేశమని మంత్రి పొంగులేటి తెలిపారు. తెలంగాణ రెవెన్యూ చట్టం దేశానికే రోల్‌మోడల్‌గా ఉంటుందన్నారు. నిపుణులతో కమిటీ వేసి అధ్యయనం చేయించామని, వివిధ వర్గాలతో సుదీర్ఘంగా అధ్యయనం చేసి చట్టాన్ని రూపొందించామన్నారు. ఈ చట్టాన్ని మొదట రంగారెడ్డి జిల్లా యాచారం, నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు. ధరణిలో 13 నుంచి 16 కాలమ్స్ ఉండేలా ప్రక్షాళన చేస్తామన్నారు.