పీఎం కిసాన్ 19వ విడత కింద ఇవాళ రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమకానుంది. దేశవ్యాప్తంగా 9.7 కోట్లమంది రైతులకు మొత్తం రూ.22వేల కోట్లను కేంద్రం ఇవ్వనుంది. 2019లో ప్రారంభమైన ఈ పథకంలో భాగంగా ఏటా రూ.6వేలను కేంద్రం మూడు విడతల్లో రైతుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ డబ్బులు రావాలంటే E-KYC తప్పనిసరిగా చేయాలి. పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో, లేదో https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.