సీజేఐ ఇంట గణేష్ పూజలో పాల్గొన్న ప్రధాని మోదీ

72చూసినవారు
సీజేఐ ఇంట గణేష్ పూజలో పాల్గొన్న ప్రధాని మోదీ
న్యూదిల్లీలోని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డి.వై చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన గణేష్ పూజలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. చీఫ్ జస్టిస్, ఆయన భార్య కల్పనా దాస్‌తో కలిసి ప్రధాని మోదీ గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. గణేశుడికి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా పూజలో పాల్గొన్న ఫొటోలను ప్రధాని 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. విఘ్నేశ్వరుడు మనందరికీ ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రార్థించినట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్