ఆసుపత్రుల్లో వయనాడ్‌ బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ (వీడియో)

75చూసినవారు
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడిన ప్రమాదంలో వందలాది మంది గాయపడ్డారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు కేరళ సీఎం పినరయి విజయన్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఆస్పత్రులకు వెళ్లారు. బాధితులతో కాసేపు మాట్లాడి ధైర్యం కల్పించారు. తొలుత కేరళ సీఎం పినరయి విజయన్‌తో కలిసి కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్