శ్రీ సత్యసాయి జిల్లాలో ఎస్పీ రత్న సాంకేతికతను వినియోగించి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిర్మానుష్య ప్రదేశాలను పేకాట రాయుళ్లు అడ్డగా మార్చుకొని పేకాట ఆడుతుండడంతో డ్రోన్లను రంగంలోకి దించారు. ఈ క్రమంలో సోమవారం డ్రోన్ల ద్వారా అటవీ ప్రాంతాలను పరిశీలించగా వాటిని చూసిన పేకాటరాయుళ్లు పరుగులు పెట్టారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.