బీఆర్ఎస్ నేతలు సంజయ్, రాజయ్య, మెతుకు ఆనంద్ ఇళ్లకు పోలీసులు వెళ్లారు. రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య సేవలపై అధ్యయనం కోసం ఇటీవల BRS కమిటీ వేసింది. వైద్యులైన ఈ ముగ్గురు నేతలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వైద్య, ఆరోగ్య సేవలపై నివేదిక ఇవ్వాలని ముగ్గురిని ఆ పార్టీ ఆదేశించింది. ఈ క్రమంలో సోమవారం కమిటీ సభ్యులు గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని భావించారు. దీంతో ముగ్గురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసులు భద్రత పెంచారు.