బల్బులు దొంగిలిస్తున్న పోలీస్ (వీడియో)

69చూసినవారు
చట్టాన్ని రక్షించాల్సిన ఓ పోలీస్ దొంగగా మారాడు. ఈ ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బలియా జిల్లాలోని సికందర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ డ్యూటీలో ఉండగానే బల్బును విప్పుకుని తీసుకుపోయాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ టీవీలో రికార్డయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్