టీవీ హోస్ట్, మోడల్, నటి రాఖీ సావంత్ కు మహారాష్ట్ర పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆమె వాంగ్మూలం నమోదు చేసేందుకు ఫిబ్రవరి 24న తమ ముందు హాజరుకావాలని కోరారు. దీనికి కారణం ఆమె అంతకు ముందు ఇండియా గాట్ లాటెంట్ షో లో పాల్గొనడమే అని తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో ఢిల్లీలో జరిగిన "ఇండియా గాట్ లాటెంట్''షోలో పాల్గొన్నారు. ఆ షోలో కో-జడ్జి మహీప్ సింగ్, సావంత్ మధ్య తారా స్థాయిలో వాగ్వాదం జరగడంతో ఆమె ఈ చిక్కులో పడ్డారు.