కేజ్రీవాల్ తల్లిదండ్రులను ప్రశ్నించనున్న పోలీసులు

61చూసినవారు
కేజ్రీవాల్ తల్లిదండ్రులను ప్రశ్నించనున్న పోలీసులు
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సీఎం నివాసంలోనే తనపై దాడి జరిగినట్లు ఎంపీ ఫిర్యాదు చేయడంతో అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో కేజ్రీవాల్ తల్లిదండ్రులను కూడా పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.