ఫ్యాన్సీ నంబర్లతో రూ.119 కోట్ల ఆదాయం

70చూసినవారు
ఫ్యాన్సీ నంబర్లతో రూ.119 కోట్ల ఆదాయం
ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్‌ పెరుగుతుండడంతో రవాణాశాఖకు కాసుల పంట పండుతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కేవలం ఫ్యాన్సీ నంబర్ల ద్వారానే రూ.119.73 కోట్లు ఆదాయం సమకూరింది. 2014-15లో అది కేవలం రూ.23.24 కోట్లే. తాజాగా టీజీ 09 9999 నంబరు ఏకంగా రూ.25 లక్షలపైనే పలికింది. ఖరీదైన కార్లకు నంబర్లు ఫ్యాన్సీగా ఉండాలని పోటాపోటీగా వేలంలో పాల్గొని దక్కించుకుంటున్నారు. 99999, 0001 లాంటి నంబర్లకు ఎక్కువగా డిమాండ్‌ ఉంది.

సంబంధిత పోస్ట్