కులగణన సర్వేలో గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉంది: కూనంనేని

73చూసినవారు
కులగణన సర్వేలో గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉంది: కూనంనేని
కుల గణన సర్వే సమాచారంతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని.. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కుల గణన సర్వే మంచిదే అయినప్పటికీ కేవలం అందుకు సంబంధించిన అంశాలకే పరిమితమవ్వాలని సూచించారు. సైబర్ నేరాలు జరుగుతున్నందున సెల్ నెంబర్లు, బ్యాంక్ ఖాతాలు, ఆధార్ కార్డు తదితర వివరాలు సైబర్ నేరగాళ్ళ చేతికి చిక్కితే ఇబ్బంది అవుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్